జన్నారం, (ఆంధ్రప్రభ) : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అన్నారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ రెవెన్యూ శివారులోని వ్యవసాయ పంటలు సాగు చేయని భూములను క్షేత్రస్థాయిలో అధికారులతో ఉమ్మడిగా ఆయన శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలతో లబ్ధి చేకూరాలన్నదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు.ప్రస్తుతం ప్రభుత్వం నాలుగు పథకాల గురించి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తుందని, అందులో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత మండల స్థాయి అధికారులపై ఉందని ఆయన చెప్పారు. సర్వేలను పారదర్శకంగా నిర్వహించాలని ఆయన తెలిపారు.
ఆయన వెంట స్థానిక తహసిల్దార్ రాజమనోహర్ రెడ్డి, స్థానిక డిప్యూటీ తాహసిల్దార్ రామ్మోహన్,ఎమ్మారై గంగరాజు, స్థానిక ఏ ఈ ఓ మల్యాల త్రిసంధ్య, తదితరులున్నారు.