ఆర్ అండ్ బీ అధికారులపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేగుంట నుండి గజ్వేల్ కు వెళ్లే రహదారిలో గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందులు అవుతున్నప్పటికి ఎందుకు పట్టించుకోవడంలేదని ఆగ్రహించారు.రోజు వందలాది భారీ వాహనాలు ఈ దారి గుండా వెళ్తున్న అనేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్న ఎందుకు రిపేర్ చేయలేదంటూ ప్రశ్నించారు. తక్షణమే రోడ్డు మరమ్మతులతో పాటు రోడ్డు ప్రక్కన ఉన్న కరెంటు స్తంభాలను సైతం పక్కకు తొలగించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆర్ అండ్ బీ అధికారులు గుంతలు పడ్డ రహదారిని మరమ్మతు చేయడం కోసం తక్షణ చర్యలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట చేగుంట మండల మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధులు అందజేత
చేగుంట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అందజేశారు. సుమారు లక్ష పదిహేను వేల రూపాయల మేర ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందించారు