హైదరాబాద్, : మినీ మునిసి పోల్స్‌లో దుమ్మురేపిన టీఆర్‌ఎస్ ఇపుడు మేయర్, మునిసిపల్ ఛైర్మన్‌ల నియామకంపై దృష్టి పెట్టింది. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటి మేయర్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మునిసిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహిం చేందుకు టీఆర్‌ఎస్ పార్టీ పరిశీలకులను నియ మించింది. ఈ మేరకు ఎన్నికల పరిశీలకుల పేర్లను సీఎం కేసీఆర్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నిక ప్రక్రియ శుక్రవారం జరగనుంది. ఒక్కో పురపాలికకు కీలక మంత్రు లు, ముఖ్యనేతలకు ఇన్‌ఛార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. టీఆర్‌ఎస్ అన్ని పురపాలికల్లో నూ ఏకపక్ష విజయాలు సాధించగా, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. సామా జిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని అభ్య ర్ధుల ఎంపిక జరిగే అవకాశం ఉంది. వరంగల్ మేయర్‌గా గుండుసుధారాణిని నియమించా లని సీఎం నిర్ణయించి ఆమెతో పోటీచేయించా రన్న ప్రచారం ఉంది. అయితే ఇక్కడ ఇతర నేతలు కూడా తీవ్రంగా పోటీ పడుతున్నారు. పద్మశాలి, ముదిరాజ్ సామాజికవర్గాల నేతలు వివిధ పదవుల కోసం గట్టి పోటీ పడుతున్నారు. ఖమ్మం కార్పోరేషన్ మేయర్ పదవికి నీరజ పేరు వినబడుతుండగా, సిద్దిపేట మునిసిపల్ ఛైర్మన్‌గా మంజుల పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారముంది. ప్రచారంలో ఉన్న నేతలతో పాటు తెరవెనుక అనేకమంది నేతలు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఆయా నగరాలు, పట్టణాల్లో ఉన్న స్థానిక పరిస్థితులు, సమీకరణల దృష్ట్యా మంత్రులు, నేతలను సీఎం పరిశీలకులుగా నియమించారు.
పరిశీలకులు వీరే
వరంగల్ కార్పొరేషన్ – మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్
ఖమ్మం కార్పొరేషన్ – మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పార్టీ జనరల్ సెక్రెటరీ నూకల నరేష్ రెడ్డి
కొత్తూరు మునిసిపాలిటీ – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నకిరేకల్ మునిసిపాలిటీ – టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు
సిద్దిపేట మునిసిపాలిటీ – రవీందర్ సింగ్ (మాజీ మేయర్ కరీంనగర్), వంటేరు ప్రతాప్‌రెడ్డి (ఫారెస్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్)
అచ్చంపేట మునిసిపాలిటీ – మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
జడ్చర్ల మునిసిపాలిటీ – మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి (సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్)
టి ఆర్ ఎస్ లో మేయర్ , ఛైర్మన్ పదవులకు తీవ్ర పోటి
Advertisement
తాజా వార్తలు
Advertisement