ఖమ్మం బ్యూరో : ఖమ్మం అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తరపున ఖమ్మం నగర మేయర్ నీరజ ఇవాళ ఖమ్మం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం (మున్సిపల్ కార్యాలయం)లో నామినేషన్ సెట్లను దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదర్శ్ సురభికి ఆయా పత్రాలు ధాఖలు చేశారు. నగర మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, సుడా చైర్మన్ విజయ్ కుమార్, జెడ్పీటీసీ ప్రియాంక, తదితరులు ఉన్నారు.
-తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న పువ్వాడ.. :
ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు పత్రాలను తల్లిదండ్రులు పువ్వాడ నాగేశ్వర రావు, విజయలక్ష్మిలకు అందజేసి వారి నుండి పువ్వాడ అజయ్ కుమార్ ఆశీర్వాదం తీసుకున్నారు. నామినేషన్ కు అయ్యే నగదును తల్లిదండ్రుల నుండి తీసుకుని ఆయా నామినేషన్లను తమ అనుచరుల ద్వారా ధాఖలు చేశారు.
- Advertisement -