Thursday, November 21, 2024

మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ లుగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన విజ‌య‌ల‌క్ష్మీ, శ్రీల‌త‌..

హైద‌రాబాద్ : గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్‌గా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్‌గా మోతె శ్రీల‌త రెడ్డి సోమ‌వారం ఉద‌యం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో మేయ‌ర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి రాజ్య‌స‌భ స‌భ్యుడు కే కేశ‌వ‌రావు, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు కార్పొరేట‌ర్లు హాజ‌ర‌య్యారు. మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన విజ‌య‌ల‌క్ష్మి, శ్రీల‌త రెడ్డికి ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ నెల 11వ తేదీన మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్‌గా మోతె శ్రీల‌త‌ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement