తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ కానున్నారు. అందుకు సంబంధించి తెలంగాణ సర్కార్ బదిలీల కసరత్తు పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత ఐఏఎస్ అధికారులు బదిలీ అవుతున్నారు. పలువురు ఐఏఎస్ లు నాలుగేళ్లుగా ఒకే పోస్టులో ఉన్నారు. ఎన్నికలకు ఏడాది ముందు సీఎం కేసీఆర్ ప్రక్షాళన చేస్తున్నారు. బదిలీల తర్వాత సీఎం కేసీఆర్ కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement