జడ్చర్ల,నవంబర్ 15 (ప్రభ న్యూస్):
మహబూబ్‌గర్ జిల్లా జడ్చర్ల 44వ జాతీయ రహదారి పై మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో పోలీసుల తనిఖీలు చేస్తుండగా పక్కా సమాచారం ప్రకారం స్టేట్ సేల్స్ టాక్స్ కమిషనర్ డీసీఎం టీఎస్30 టీ0908 నెంబర్ గల వాహనంలో ఎలాంటి పత్రాలు లేని మద్యం తరలిస్తుండగా పోలీసులు వెంటనే డ్రైవర్ ని డీసీఎంని అదుపులోకి తీసుకొని జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు.
ట్రైనింగ్ సెంటర్లో వాహనాన్ని ఉంచి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.అయితే ఎన్నికల వేళ ఈ మద్యం ఎవరిది… ఏ పార్టీకి చెందింది అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా అశోక్ కుమార్ జీఎస్‌టీ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ పై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించి భయ భ్రాంతులు గురి చేశారని వ్రాతపూర్వకంగా కంప్లెయింట్ ఇచ్చినా స్థానిక పోలీసులు కంప్లెయింట్ తీసుకోవడం లేదని సమాచారం.