ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహలు జరిగాయి. ఈ వేడుకలో 220జంటలు ఒక్కటికావడం విశేషం. ఈ సంఘటన
నాగర్ కర్నూల్ జిల్లాలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగింది. కాగా ట్రస్టు ఛైర్మన్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో సామూహిక వివాహాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సినిమా సెట్టింగ్‌లను తలపించేలా పాఠశాల ఆవరణను అలంకరించారు. 220 పందిళ్లు వేసి.. ఉదయం 10.05 గంటలకు 220 మంది పూజారులతో శాస్త్రోక్తంగా పెళ్లిళ్లు జరిపించారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, కేశవరావు, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి దంపతులు, కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్‌లు కొత్త జంటలను ఆశీర్వదించారు. కాగా ప్రతి జంటకు బీరువా, మంచం, పరుపు, దుప్పట్లు, రెండు కుర్చీలు, స్టీల్ సామగ్రి, కుక్కర్, మిక్సీ తదితర సామగ్రిని అందజేశారు.
సామూహిక వివాహలు.. ఒక్కటయిన 220జంటలు
Advertisement
తాజా వార్తలు
Advertisement