తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి ఇప్పుడు ఉన్న వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుందని ఆయన అన్నారు. తాజాగా తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గాలి ద్వారా కరోనా వేగంగా విస్తరిస్తోందని… ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ఇంట్లో ఒకరికి కారణం వస్తే అందరికీ తొందరగా స్ప్రెడ్ అవుతుందని అందుకోసమే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆయన హెచ్చరించారు.
ఇప్పటికే కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో.. మాస్క్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాలు, సభలు, సమావేశాల్లో.. పనిచేస్తున్న కార్యాలయాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. మాస్క్ పెట్టుకోకపోతే.. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఐపీసీ సెక్షన్ 188 కింద వెయ్యి రూపాయల ఫైన్ కట్టాల్సిందేనని చెప్పింది సర్కార్. ఇంటి నుంచి బయటకు వస్తే.. ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాల్సిందేనని సూచించింది. అయితే ఇంట్లో కూడా మాస్క్ ధరిస్తే కరోనా నుంచి రక్షణ పొందవచ్చని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెబుతున్నారు.
ఇక వారం క్రితమే ఢిల్లీలో కార్ లో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తి మాస్కు ధరించి లేదని పోలీసులు ఫైన్ వేశారు. దీనిపై సదరు వ్యక్తి హైకోర్టు ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు కారులో వెళ్లినా తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని పేర్కొంది. మాస్క్ అనేది సురక్ష కవచం లాంటిదని, ధరించిన వ్యక్తితో పాటు చుట్టుపక్కలవాళ్లకు కూడా రక్షణ ఉంటుందని కోర్టు తెలిపింది. ఒంటరిగా డ్రైవింగ్ చేసే సమయంలో మాస్క్ ధరించలేదని జరిమానా విధించడంపై నమోదైన కేసుపై ఢిల్లీ హైకోర్టు విచారించింది