హైదరాబాద్ – మాసాబ్ ట్యాంక్‌లోని ఇన్ కమ్ ట్యాక్స్ టవర్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపింది. నేటి మధ్యాహ్నం కంట్రోల్ రూం నెంబర్ 100 కు ఫోన్ చేసిన అగంతకుడు మరికొద్ది సేపట్లో ఐటీ ఆఫీస్‌లో బాంబు పేలనుందని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెంటనే కంట్రోల్ రూం సిబ్బంది స్థానిక పోలీసులను అలర్ట్ చేసారు.
బాంబు వార్త వినడంతో కార్యాలయంలోని వ్యాపించటంతో అధికారులు, సిబ్బంది పరుగు పరుగున బయటకు వచ్చారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించారు. పోలీస్ జాగిలాలు, మెటల్ డిటెక్టర్ల సాయంతో స్క్వాడ్ సిబ్బంది గాలించారు.. అయితే ఎటువంటి బాంబులు కనిపించలేదు.. దీంతో ఫేక్ కాల్ గా పోలీసులు గుర్తించారు.. కాల్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు…