కుల్కచర్ల, ప్రభ న్యూస్ : మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని అంతారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం నాడు గ్రామానికి చెందిన చౌట అంబిక భర్త శ్రీనివాస్( 24 )సంవత్సరాలు వృత్తి గృహిణి కులము ముదిరాజ్ నివాసము అంతారం గ్రామం లో నివసిస్తున్నారు వీరికి 2017 సంవత్సరంలో గ్రామానికి చెందిన చౌట శ్రీనివాస్ ను పెళ్లి చేసుకున్నది.
అయితే ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉన్న దూలానికి చున్నీతో ఉరి వేసుకుని చనిపోయినది. అయితే ఆమె మరణానికి సరైన కారణం తెలుసుకొనుటకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital