కనగల్: అత్తింటివారి కట్నం వేధింపుల కు తాళలేక ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లా కనగల్ ఎస్ఐ నగేష్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని రేగట్టె గ్రామానికి చెందిన అన్ని మల్ల యాదయ్య తన కుమార్తె కృష్ణవేణి( 24)కి రెండేళ్ల కిందట త్రిపురారం గ్రామానికి చెందిన మద్దూరి నవీన్ కుమార్ తో వివాహం జరిపించాడు. కొంత కాలం ఇద్దరూ బాగానే ఉన్నారు. తరువాత అదనపు కట్నం కోసం వేధించసాగాడు. అతనికి తోడు అత్త కోటమ్మ మరిది శ్రీకాంత్ కూడా సూటిపోటి మాటలతో హింసించటం పరిపాటిగా మారింది. ఆరు నెలల క్రితం డెలివరీ కోసం తల్లిగారింటికి వచ్చి అప్పటి నుంచి అక్కడే ఉంటుంది. అయినప్పటికీ తరచూ ఫోనులో రూ 50,000 వేలు అదనపు కట్నం, బైకు తీసుకురావాలని భర్తతో పాటు అత్త మరిది వేధిస్తున్నారు. ఈ క్రమంలో వారి వేధింపులు తాళలేక బుధవారం తెల్లవారు జామున వంట గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఐదు నెలల బాబు ఉన్నాడు. నల్లగొండ డీఎస్‌పీ వెంకటేశ్వర్ రెడ్డి
కనగల్ తాసిల్దార్ శ్రీనివా సరావు. మృతదేహాన్ని సందర్శించి ఆత్మహత్యకు గల కారణాలు మృతురాలి తల్లిదండ్రులను బంధువులను అడిగి తెలుసుకున్నారు. తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
Advertisement
తాజా వార్తలు
Advertisement