Friday, November 22, 2024

TS : భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి…. సిరిసిల్ల నేతన్నబంగారపు చీర

సిరిసిల్ల, ఏప్రిల్ 15 (ప్రభన్యూస్): భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణానికి సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ పట్టు చీరను సిద్ధం చేశారు. సీతారాముల కల్యాణానికి సిరిసిల్ల సీతమ్మ కళ్యాణం చీర ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇస్తున్న వెల్ది హరిప్రసాద్ ఈసారి మరో అద్భుతమైన చీరను చేనేత మగ్గంపై సీత రాముల కళ్యాణం వచ్చే విధంగా రూపొందించారు.

- Advertisement -

అలాగే అంచులు (బార్డర్లు) భద్రాద్రి దేవాలయంలో ఉన్నటువంటి సీతారాముల ప్రతిరూపాలు అంచులు వచ్చే విధంగా చీర మొత్తం శంఖు చక్ర నామాలు చీరపై బార్డర్లో జై శ్రీరామ్ అంటూ వచ్చే విధంగా ఆరు రోజుల పాటు శ్రమించి ఈ చీరను చేనేత మగ్గంపై నేశాడు. ఈ చీర బరువు 800 గ్రాములు ఉంటుంది. ఇందులో రెండు గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి, పట్టు దారాలతో నేశాడు. చీర కొంగులో సీతారాముల కళ్యాణం బొమ్మ నేయడం విశేషం. కాగా దీనిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు చూపి, సీతారాముల కల్యాణానికి అందిస్తానని వెళ్లి హరిప్రసాద్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement