Monday, November 25, 2024

ఎంబీబీఎస్ ప్రవేశాలకు మాప్ ఆఫ్ నోటిఫికేషన్.. 7,8 తేదిల్లో వెబ్ ఆప్షన్లు

వరంగల్, ప్రభన్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో మిగిలి పోయిన ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లభర్తీకి ఈ నెల 7,8 తేదిల్లో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పేర్కొంది. ఈ మేరకు బుధవారం తుది మాప్ ఆఫ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే నాలుగు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. అదనపు మాప్ ఆఫ్ విడత కౌన్సిలింగ్ తర్వాత ఖాళీ గా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సీట్ల ఖాళీల వివరాలను వెబ్ సైట్ లో పొందుపర్చినట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 7న సాయంత్రం 4 గంటల నుంచి 8వ తేది మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపింది.

ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలో ని అర్హులైన విద్యార్థులు ఈ విడత కౌన్సిలింగ్ లో పాల్గొనవచ్చని తెలిపింది. గత విడత కౌన్సిలింగ్ లో సీట్ అలాట్ అయి జాయిన్ కాకపోయిన చేరి డిస్ కంటిన్యూ చేసినా అదే విధంగా ఆల్ ఇండియా కోటా లో ఇప్పటికే చేరినా అట్టి విద్యార్థులతో పాటు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిదిలో ని కళాశాలల్లో సీటు పొందిన విద్యార్థులు ఈ కౌన్సిలింగ్ కు అనర్హులగా పేర్కొంది. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement