హైదరాబాద్ – బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా సమర శీల ఉద్యమాలు చేపట్టాలంటూ మావోయిస్ట్ లు పిలుపు ఇచ్చారు.. దీనిలో భాగంగానే బీజేపి పార్టీని తెలంగాణ నుంచి తన్నితరిమివేయాలని ప్రజలను కోరారు..ఈ మేరకు మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ బహిరంగ లేఖను విడుదల చేశారు..
ఆ లేఖ యదాతధంగా మీకోసం
తెలంగాణ రాష్ట్రంలో బీజేపి మత తత్వ రాజకీయాల కోసం మత విద్వేశాలను రెచ్చగొట్టి ప్రజల్లో ఘర్షణలు సృష్టించాలని చూస్తుంది. ఆదివారం చేవెళ్లకు వచ్చిన కేంద్ర హెూం శాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో ఉపన్యాసిస్తూ తెలంగాణలో ముస్లింలకు రాజ్యంగ విరుద్ధంగా, లోప భూయిష్టంగా రిజర్వేషన్ కల్పించారని మేము అధికారంలో వస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఈ రిజర్వేషన్స్ చేందేలాగా చూస్తామని ప్రకటించారు. అంతే కాకుండా తెలంగాణలో రామ రాజ్యం స్థాపిస్తామని, తెలంగాణ విమోచన దినం ఘనంగా జరుపుతామని ప్రకటించారు.
దేశంలో ముస్లింలు ఈ దేశ పౌరులు కాదా? బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టులు దేశాన్ని హిందూ రాష్ట్ర (హిందూ దేశం)గా మార్చాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారు.. కర్ణాటకలో బీజేపి ప్రభుత్వం ముస్లింలకున్న 4శాతం రిజర్వేషన్‌ను రద్దు చేసి విద్రోహానికి పాల్పడింది. ఈ ఘన కార్యాన్ని కర్ణాటక ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ షా నిసుగ్గుగా ప్రకటించుకుంటున్నాడు. హిందుత్వ ఏజెండాతో దేశాన్ని మత ప్రాతపదికన విభజించి హిందూ రాజ్య స్థాపన దిశగా బీజేపి ప్రయత్నిస్తుంది. తెలంగాణలో వచ్చే తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో, 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి కుట్ర పూరిత ఏజెండాను ముందుకు తీసుకెళ్తుంది. బీజేపి దేశంలోని డబుల్ ఇంజన్ సర్కార్ లలో తొమ్మది రాష్ట్రాల్లో బూర్జువా పార్లమెంట్ ప్రజా స్వామ్యాన్ని అపహస్యం చేస్తూ కుట్ర పూరరిత విధానాలతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని చేపట్టింది. అధికారం చేపట్టిన బీజేపి పాలిత రాష్ట్రాలలో నిత్యం మత ఘర్షలతో అట్టుడిగి పోతున్నాయి. మైనార్టీ, దళిత ప్రజలపై దాడులు, అత్యాచారాలు నిత్యం కృత్యం అయ్యాయి. బీజేపి పాలితలో రాష్ట్రాలో రామ రాజ్యం మత ఘర్షణలతో ఎంత వెలిగి పోతుందో దేశ ప్రజలందరికి తెలిసిందే. పటేల్ నాయకత్వంలోని తెలంగాణకు విద్రోహం తలపెట్టిన పటేల్‌ను తలకెత్తుకోని మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన జరుపుతామంటున్నారు. భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం అనే హిత భోదలు చేస్తూ మత ప్రాతిపదికన ప్రజలను విడిదీస్తున్నారు.
తెలంగాణకు అమిత్ షా రాక ముస్లింలేకే కాదు తెలంగాణ ప్రజలకు ప్రమాద ఘంటికల సూచిక. తెలంగాణలో బీజేపి అధికారంలోకి రావడం మంటే 2001 గుజరాత్లో జరిగిన మారణ హెూమం తెలంగాణలో కొనితెచ్చుకోవడమే. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం నేడు భారత ప్రజలందరి ప్రధాన శతృవు. వాటి సైద్ధాంతిక లక్ష్యం హిందూ రాజ్యాని నిర్మించి ప్రజా స్వామ్యం లేని, ప్రతిపక్షం లేని నిరంకుశత్వ పాలనను ఏర్పర్చడం, సామ్రాజ్య వాదులకు, ఆదాని లాంటి కార్పొరేట్లకు, భూస్వాములకు దేశ సంపదను దోచి పెట్టడం అనేది ప్రధాన లక్ష్యం. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా మైనార్టీలు, దళితులు, మహిళలు, బుద్ధి జీవులు, ప్రజా స్వామిక వాదులు అన్ని సామాజిక సెక్షన్ల ప్రజలు సమరశీల ఉద్యమాలను చేపట్టాలని పిలుపునిస్తున్నాం. తెలంగాణలో బీజేపి పార్టీని రానివకుండా తన్నితరమాలని పిలుపునిస్తున్నాం.
ఇట్లు
జగన్ … మావోయిస్ట్ అధికార ప్రతినిధి