హైదరాబాద్: ప్రజా యుద్దనౌక గద్దర్ మృతి తీవ్రంగా కలిచివేసిందని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అనారోగ్యంతో గద్దర్ నిన్న మధ్యాహ్నం మరణించారు. దీనిపై సోమవారంనాడు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ ప్రకటన మీడియాకు విడుదల చేసింది.. ఆయన మృతికి సంతాపం ప్రకటించింది..
ఆ ప్రకటనలో గద్దర్ నాలుగేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నారని, అయన అవసరాన్ని గుర్తించి ఆయనను బయటకు పార్టీకి నుంచి పంపామని వెల్లడించింది. గద్దర్ చేత జననాట్యమండలిని ఏర్పాటు చేయించి ప్రజలను చైతన్యపరిచినట్టుగా మావోయిస్టు పార్టీ తెలిపింది. ఇతర పార్టీలతో కలిసినందుకు గద్దర్ షోకాజ్ నోటీసు ఇచ్చినట్టుగా మావోయిస్టు పార్టీ వివరించింది. 2012 వరకు పీడిత ప్రజల పక్షాన గద్దర్ ఉన్నారని మావోయిస్టు పార్టీ తెలిపింది. 2012లో గద్దర్ మావోయిస్టు పార్టీకి రాజీనామా చేశారని ఆ పార్టీ ప్రకటించింది. గద్దర్ రాజీనామాను పార్టీ ఆమోదించినట్టుగా ఆ పార్టీ తెలిపింది. 2012 వరకు పీడిత ప్రజల పక్షాన ఉన్న గద్దర్ పార్లమెంట్ మార్గాన్ని ఎంచుకున్నారని మావోయిస్టు పార్టీ తెలిపింది. గద్దర్ సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు పార్టీలో పనిచేశారని . మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు జననాట్యమండలి ద్వారా గద్దర్ ప్రయత్నించారని ఆ ప్రకటనలో పేర్కొంది. .ఆ తర్వాతి కాలంలో గద్దర్ బుల్లెట్ ను వదిలి బ్యాలెట్ వైపు మొగ్గు చూపారంది. 2018 ఎన్నికల్లో తొలిసారిగా గద్దర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారని,. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కూడ గద్దర్ ప్లాన్ చేసుకున్నారని వివరించింది. గద్దర్ పేదల పక్షాన పోరాడరని, తన గళం ద్వారా మావోయిస్ట్ భావజాలన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో విజయం సాధించారంటూ తన సంతాప సందేశంలో మావోయిస్ట్ పేర్కొంది.