Sunday, November 17, 2024

Maoist letter: మేడారం జాతర పూర్తిగా ఆదివాసి సంప్రదాయాలతో నిర్వహించాలి – మావోయిస్టుల డిమాండ్

ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ‌ కలకలం రేపింది. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జేఎండ‌బ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేష్ పేరుతో లేఖ విడుద‌ల చేశారు. మేడారం జాతర పూర్తిగా ఆదివాసి సాంప్రదాయాలతో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ, హిందూ సాంప్రదాయాలైన లడ్డు, పులిహోర కాకుండా బెల్లం ప్రసాదంగా ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. జాతర ముగిసిన వెంటనే పరిసర ప్రాంతాల స్థానికులకు వ్యాధులు రాకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ,జాతర కోసం పంటలు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

లేఖలో ఏముందంటే..

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆదివాసి ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఆరాధ్య దైవంగా పూజిస్తారు ఆదివాలీ ప్రజలపై కాకతీయ రాజుల అధిక పన్నులు విధించి వాటిని చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఆ పన్నులు మేము చెల్లించలేమని సమ్మక్క సారలమ్మలు రాజు వ్యతిరేకంగా పోరాడుతూ అసువులుబాసారు. అప్పటి నుండి ఆదివాసి ప్రజలంతా సమ్మిత్కి సారలమ్మలను ఆరాధ్య దైవంగా పూజిస్తారు. వారి పోరాటాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆదివాసి సాంప్రదాయాలతో స్మరించుకుంటారు. ఆదివాసులలో ఉన్న ఈ సెంటిమెంటును ఆసరా చేసుకొని ఆదివారీలు చేసుకునే ఈ పండుగను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుని ఆదివాసుల పాత్రను నాయమాత్రం చేసిందని లేఖలో పేర్కొన్నారు. మేడారం జాతరకు 4 రాష్ట్రాల నుండి కోటికి పైగా ప్రజలు వస్తున్నారు. ఈ భక్తుల ద్వారా ప్రభుత్వానికి పెద్దఎత్తున విధులు వస్తున్నాయి. ఈ విధులను ఆదివారీ ప్రాంతంలోనే ఖర్చు చేసి అభివృద్ధి చేయవచ్చు కాని ఈ నిధులను దారి మళ్లించి స్థానిక ఆదివాసీలకు నిర్లక్ష్యం చేయడంతో వారు మరింత పేదలుగా మారిపోతున్నారు.

మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వం ముందు దృష్టితో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి కాని ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ప్రభుత్వం సమయం దగ్గర పడుతున్న క్రమంలో జాతర పనులను కాంట్రాక్టర్లకు ఇచ్చింది. వాళ్ళు నిర్లక్ష్య వైఖరితో పనులను సత్తవడన పదులను చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్ని తెగిపోయాయి. వాటిని ఇప్పటి వరకు నిర్మించలేదు. ఇప్పుడు ఆదరాబాదరాగా నిర్లక్ష్యంగా రోడ్డు పోయడంతో గుంతలు అలాగే ఉండడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు చనిపోతున్నారు. జాతరకు వస్తున్న ప్రజలకు మౌళిక సరుపాయాలు కల్పించక పోవడం, పారిశుధ్య పనులు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో పాటు జాతరకు వచ్చిన ప్రజలు అసౌకర్యాలకు గురయి వెనక్కి తిరిగిపోతున్నారని తెలిపారు. ప్రజల నుండి ఒక పక్క పన్నులు వసూలు చేస్తూ వారి సౌకర్యాలు కల్పించకపోవడంతో నిరాశ, విస్తృహలకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వమే పూర్తి బాధ్యతలను వేగవంతం చేసి పూర్తి చేయాలి. భక్తులకు సౌకర్యాలు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.

డిమాండ్ ఇవే..

- Advertisement -

1. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను పూర్తిగా సాంప్రదాయాలతోనే చేయాలి.
2. హిందూ సాంప్రదాయాలైన లడ్డు పులిహోరి లాంటి బెల్లం ప్రసాదంగా ఇవ్వాలి.
3. జాతర అయిన వెంటనే ప్రాంతంలో ప్రభుత్వం బాధ్యత వహించి నిధులు కటాయించి జబ్బులు రాకుండా శుభ్రం చేయాలి. జబ్బుపడిన వారికి తగిన చికిత్సను అందించాలి.
4. జాతర పనుల కోసం విడిచిపెట్టిన పంట పొలాలకు నష్టపరిఆహారం ఇవ్వాలి. పంట పొలాల్లో బ్రాందీ దీపాలతో పాటు రకరకాల స్వర్ణ పదార్థాలన్నింటిని తీసి వేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుని చేయాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement