Wednesday, November 6, 2024

Manuguru – గిరిజనేతరుడికి ఇసుక దారాధత్తం – చినరావిగూడెం మహిళల ధ‌ర్నా

( ఆంధ్రప్రభ స్మార్ట్, మణుగూరు) – తమకు కేటాయించిన ఇసుకను గిరిజనేతరుడికి దొడ్డిదారిలో దారాధత్తం చేశారని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ అనుమతిని రద్దు చేసి, తమను ఆదుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తాహసీల్దారుకు చినరావిగూడెం గ్రామానికి చెందిన సమ్మక్క సారక్క ట్రైబల్ శాండ్ క్వారీ లేబర్ కాంట్రాక్ట్ మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ మహిళలు అభ్యర్థించారు.

వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ మైనింగ్ కార్పొరేషన్ కు ఈ సొసైటీ 2,40,000 క్యూబిక్ మీటర్ల ఇసుకను తోలారు. మిగిలిన ఇసుకను అర్దంతరంగా గిరిజనేతరుడు గంట్ల రమేష్ కు దొడ్డిదారిలో కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్డరుతో చినరావిగూడేనికి రమేష్ చేరుకుని ఆ ఇసుకపై తనకే హక్కు ఉందని సొసైటీ సభ్యులను బెదిరించాడు. పైగా తనకు రాజకీయ అండ ఉందని, నియోజకవర్గంలో తాను ఎంత చెబితే అంతేనని, తన మాట వినకపోతే అంతు చూస్తా అని బెదిరిస్తున్నాడని సోసైటీ సభ్యులు వాపోయారు. పైగా ఈ సొసైటీని రద్దు చేయిస్తానని బెదిరిస్తున్నాడని, ఆ వ్యక్తి పై తగు చర్యలు తీసుకుని, అతడికి యిచ్చిన ఆర్డరును రద్దు చేయాలని అభ్యర్థించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement