Friday, November 22, 2024

Manuguru – సింగరేణి గనులలో సీఎండీ బలరాం ఆకస్మిక తనిఖీలు

ఓసీ లలో ఆకస్మికంగా తనిఖీ
సింగరేణి సీఎండీ బలరాం
కార్మికులతో కలిసి ఆల్పాహరం
ప్రతి ఒక్క కార్మకుడికి న్యాయం

మణుగూరు, ఆగస్టు 16 (ప్రభ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు సింగరేణి ఓసీ 2 కొండాపురం ప్రాంతాలను సింగరేణి సీఎండీ బలరాం గురువారం అర్ధరాత్రి పర్యటించి, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. శుక్రవారం ఉదయం కార్మికులతో కలిసి సింగరేణి క్యాంటిన్ లో ఆల్పాహరం సేవించారు. అనంతరం కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరు సింగరేణి పాఠశాలలో సీబీఎస్ ఈ పైలట్ కింద ప్రకటించాలని కోరారు. సింగరేణి ఆసుపత్రిలో వైద్యులు కొరత ఉందని, ఏదైనా ప్రమాదం జరిగితే సరైన వైద్య సేవలు లేక, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యలు విన్న సీఎండీ బలరాం త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

సింగరేణి ఏరియాలో పనిచేసే కార్మికులకు అందించే హక్కులు, ప్రయోజనాలు విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని, వెంటనే అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ (పీఅండ్ పీ) జి వెంకటేశ్వర రెడ్డి, మణుగూరు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్, ఎస్వోటు జీఎం డి శ్యామ్ సుందర్, ప్రాజెక్ట్ అధికారులు లక్ష్మీపతి గౌడ్, శ్రీనివాస చారి, డీజీఎం (పర్సనల్) ఎస్ రమేష్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వై రాం గోపాల్, ఐఎన్టీయుసి బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వత్సవాయి కృష్ణంరాజు, ఇతర అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement