మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్‌పై 9 మంది కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌పై ఈనెల 1వ తేదీన పెద్దపల్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు మంథని ఆర్డీవో, ప్రిసైడింగ్ అధికారి హనుమానాయక్ అధ్యక్షతన అవిశ్వాసంపై శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా చేతులు ఎత్తడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీవో ప్రకటించారు. మంథని మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాలుస్తూ హర్షం వ్యక్తం చేశారు.