ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: బిఆర్ యస్ సీనియర్ నాయకులు, కాటారం పిఏసిఎస్ చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి గురువారం భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ,. . 2017 కేసీఆర్ పిలుపు మేరకు బిఆర్ ఎస్ పార్టీలో చేరానన్నారు. అప్పటి నుండి పార్టీ కోసం అహర్నిశలు పని చేశానని , కాంగ్రెస్ కంచు కోటలో 2018, 2019 వివిధ ఎన్నికల్లో బిఆర్ ఎస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేసి గెలిపించుకున్నన్నారు..
అయినా పార్టీలో సరైన గుర్తింపు లేదని, ప్రజా వ్యతిరేకత వున్న అభ్యర్థికి , రౌడీ రాజకీయం చేసేవారికి టికెట్ కేటాయించడం కలిచి వేసిందన్నారు. మంథని రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు తలిపిస్తున్నాయని ఇక్కడి ప్రజలు భయం గుప్పిట్లో వున్నారని వారికి స్వెచ్చా పాలనను అందించేందుకు ముందుకు వెళ్తున్నా అని పేర్కొన్నారు.. నియంత పాలనలో పనిచేసే అవకాశం లేదని అందుకే బీ పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు. మంథని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో వుంటానని రెండు రోజుల్లో ప్రజలు , కార్యకర్తల అభీష్టం మేరకు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.