Friday, November 22, 2024

మంజీరా కుంభమేళా కు పోటేత్తిన భక్త జనం

.సంగారెడ్డి జిల్లాలో మంజీరా కుంభమేళా సోమవారం ప్రారంభమైంది. న్యాల్‌కల్‌ మండలం రాఘవాపూర్‌-చాల్కి గ్రామాల మధ్య మంజీరా నది ఒడ్డున 12 రోజులపాటు నిర్వహించే మంజీరా (గరుడగంగ) కుంభమేళా సోమవారం ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ, పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు మంజీర నదికి చేరుకున్నారు. మన దేశంలో నదులను కూడా దేవతలుగా పూజిస్తారు. అందుకే పన్నెండేళ్ల కోసారి పుష్కరాల పేరుతో ఘనంగా వేడుకలను నిర్వహించి.. నదీమ తల్లిని పూజిస్తారు ..పుష్కరాలతో పాటు కుంభమేళాను కూడా నిర్వహస్తారు. రెండో రోజు కుంభ మేళా కు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్‌ శరత్‌, ఎమ్మెల్యేలు కె.మాణిక్‌రావు, మహారెడ్డి భూపాల్‌రెడ్డి, జిల్లా సహకార, మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. పంచవటి పీఠాధిపతి కాశీనాథ బాబా పూజలు నిర్వహించారు. బోనాలు తలపై పెట్టుకుని మహిళలు తరలివస్తుండగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం వేళల్లో పూజారులు మంజీర నదికి గంగా హారతి నిర్వహించారు. 12 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో మొదటి రోజున మంచి సంఖ్యలో నాగ సాధువులు పూజల్లో పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement