న్యూఢిల్లీ – ఆంధ్రపద్రేశ్లో విలీనం చేసిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణాలో కలుపుతామని తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫోస్టో ప్రకటించింది.ఈ ఐదు విలీన గ్రామాలను తెలంగాణలో తిరిగి కలుపుతామని తెలిపింది. ఢిల్లీ నుంచి న్యాయ్ పత్ర పేరుతో మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి విడుదల చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో పోలవరం ముంపు మండలాలు కలిసిన విషయం తెలిసిందే. భద్రాచలం చుట్టుపక్కల ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
- Advertisement -