మంగపేట, ఆగస్టు 10 ( ప్రభ న్యూస్ ) : రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామిని మల్టీ జోన్ ఐజీ తరుణ్ జోషి తన మిత్రులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఐజీ తరుణ్ జోషికి ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రవణం సత్యనారాయణ, ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు.
ఐజీ తరుణ్ జోషి గోత్ర నామాలతో గర్భాలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు పూజా కార్యక్రమం అనంతరం స్వామి వారి విశిష్టత గురించి ఐజీ తరుణ్ జోషికి వివరించి తదనంతరం ఆశ్వీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు శేషవస్త్రాలు అందచేసారు. ఆయన వెంట ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, మంగపేట ఎస్సై టీ.వీ.ఆర్.సూరి తదితరులు ఉన్నారు.