ఎస్సీ వర్గీకరణ తీర్పును వెంటనే అమలు చేయండి
ఇప్పటికే ఎంతో నష్టం పోయాం
తక్షణం అమలునకు కార్యచరణ ప్రారంభించండి
రేవంత్ కు మంద కృష్ణమాదిగ వినతి
అంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలోనేడు ఆయన సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మంద మాట్లాడుతూ, ఇప్పటికే వర్గీకరణ విషయంలో ఎంతో జాప్యం జరిగిందని , దీని వల్ల మాదిగలకు అన్యాయం జరిగిందన్నారు.. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ ఫలాలు తక్షణం అందించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని రేవంత్ ను కోరారు.. సీఎంని కలిసిన వారిలో మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ తదితరులు ఉన్నారు.