హైదరాబాద్ – ఎన్నో ఏళ్లుగా వివాదాలలో చిక్కుకున్నమంచిరేవుల భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలోని 142.39 ఎకరాల భూవివాదానికి తెరదించుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆక్రమణకు గురైన భూములు ప్రభుత్వానికే చెందుతాయని తీర్పు ఇచ్చింది. భూములు గ్రేహౌండ్స్‌కు సంబంధించినవేనని తేల్చి చెప్పింది. ఇకపై కింది కోర్టులకు జోక్యం చేసుకునే అధికారం లేదని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. తమ ఆదేశాలపై ఎలాంటి జోక్యాలకు అనుమతి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ భూములు తమవని పలువురు కోర్టుని ఆశ్రయించడంతో వివాదం మొదలైంది.. ఇక సుప్రీం కోర్టు తీర్పుతో ఆ భూములపై సర్వ హక్కులు తెలంగాణ ప్రభుత్వానికి దక్కాయి..
Advertisement
తాజా వార్తలు
Advertisement