Saturday, November 23, 2024

మూడు ద‌శ‌ల్లో మ‌న ఊరు – మ‌న బ‌డి ప‌థ‌కం : స‌బితా ఇంద్రారెడ్డి

మ‌న ఊరు – మ‌న బ‌డి ప‌థ‌కాన్ని మూడు ద‌శ‌ల్లో చేప‌డుతామ‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. గ్రామాల్లో మ‌న ఊరు – మ‌న బ‌డి, ప‌ట్ట‌ణాల్లో మ‌న బ‌స్తీ – మ‌న బ‌డి పేరిట ఈ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా మ‌న ఊరు – మ‌న బ‌డి ప‌థ‌కంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స‌మాధానం ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మం కింద 12 అంశాల‌ను చేప‌ట్ట‌డం జ‌రిగింది. నీటి స‌ర‌ఫ‌రా, టాయిలెట్లు, విద్యుత్ స‌మ‌స్య‌లు, తాగునీటి స‌మ‌స్య‌లు, ఫ‌ర్నీచ‌ర్, పెయింటింగ్, గ్రీన్ చార్ట్ బోర్డులు, కంపౌండ్ వాల్స్, డైనింగ్ హాల్స్, డిజిట‌ల్ క్లాసుల‌తో పాటు త‌దిత‌ర అంశాల‌ను ప్ర‌తిపాదించామ‌న్నారు. అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియం బోధ‌న ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. మ‌న ఊరు – మ‌న బ‌డి ప‌థ‌కాన్ని సీఎం కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారని, రూ. 7 వేల కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేయ‌డం జ‌రుగుతుంద‌ని స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement