తెలంగాణలో మహిళపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం ఘటన మరువక ముందే.. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారానికి యత్నించాడు ఓ కీచకుడు. దివ్యాంగులైన బాధిత యువతి ఇంట్లో ఉండగా.. మోతీలాల్ అనే వ్యక్తి అత్యాచారం చేసేందుకు యత్నిస్తున్నట్లు గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. సంఘటన జరిగిన ప్రదేశానికి వచ్చిన పోలీసులు.. మద్యం మత్తులో ఉన్న మోతీలాల్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: ఏపీని వదిలేసి తెలంగాణకు వస్తా: ఏపీ టీడీపీ నేత జేసీ