న్యూ ఢిల్లీ – భారతీయ చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్‌ను తొలిసారిగా మన దేశంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ తాజా ఎపిసోడ్ లో మోదీ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు.
ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ లో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారని మోదీ పేర్కొన్నారు. ప్రధాని తన ప్రసంగంలో తెలుగుతో సహా పలు భాషలకు చెందిన సినీరంగ ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు.
దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. తన సినిమాలలో భారతీయ సంప్రదాయాలు, విలువలను చూపిస్తూ టాలీవుడ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు
బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేశాయని పేర్కొన్నారు. రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా భారతదేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారని కొనియాడారు