Friday, November 22, 2024

Telangana: లోన్​యాప్​ ఎగ్జిక్యూటీవ్స్​ ఆగడాలు.. హైదరాబాద్​లో వ్యక్తి ఆత్మహ్యత్య

లోన్​ యాప్​ ఎగ్జిక్యూటివ్​ల వేధింపులతో హైదరాబాద్​లోని రామ్​కోఠిలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరగింది. మృతుడిని సి. రవీందర్ యాదవ్‌గా గుర్తించారు. ఇతను ఆన్‌లైన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. కాగా, రవీంద్ర ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతని కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతను ఉరివేసుకుని కనిపించాడు. రవీంద్ర మృతదేహాన్ని కిందకు దించి సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.

రవీంద్ర అప్పులు చేసి తిరిగి చెల్లించలేకపోయాడని మృతుడి బంధువులు తెలిపారు. మృతుడికి ఫోన్ కాల్స్ వచ్చాయని, ఇదే విషయమై పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. లోన్​ యాప్​ ఎగ్జిక్యూటీవ్స్​ బెదిరింపుల కారణంగానే అతను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement