Wednesday, November 20, 2024

మైలారంలో వ్యక్తి దారుణ హత్య

గణపురం : జయశంకర్ జిల్లా గణపురం మండలం మైలారంలో దారుణ హత్య ఘ‌ట‌న‌ గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మైలారం గ్రామానికి చెందిన చాపర బోయిన శివ కుమార్ (45) గుర్తుతెలియని వ్యక్తి చేతిలో హత్యకు గురైనట్లు సమాచారం. ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే మృతుడు వేరే వ్యక్తి ఇంటి వద్ద మృతి చెందడంతో ఎవరు చంపారనేది అనుమానాస్పదంగా మారింది. సంఘటన స్థలాన్ని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, సిఐ పులి వెంకట్, ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement