Saturday, November 23, 2024

మామిళ్ల రాజేంద‌ర్ స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ‌.. ఆమోదించిన ప్ర‌భుత్వం

టీఎన్ జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ఆయ‌న పెట్టిన వీఆర్ ఎస్ అభ్య‌ర్థ‌న‌కు ఇవ్వాల‌ పబ్లిక్ అండ్ హెల్త్ డైరెక్టర్ ఆమోదం తెలిపారు. కాగా, రేపు (20వ తేదీ శుక్ర‌వారం) నుంచి విధుల నుండి రిలీవ్ కానున్నారు. ఇక‌.. ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన మామిల్ల రాజేందర్ ఎల్లుండి (శ‌నివారం) బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేర‌నున్న‌ట్టు తెలుస్తోంది. అందుకోస‌మ‌నే ఆయ‌న త‌న ఉద్యోగానికి రాజీనామా చేసిన‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement