పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు కేసీఆర్, స్టాలిన్ లకు ఫోన్ చేశారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించినట్లుగా తెలిసింది. సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకే ఇద్దరు పలు అంశాలపై చర్చించిస్తున్నామని మమతా బెనర్జీ అన్నారు.
దేశ సమాఖ్య నిర్మాణాన్ని కాపాడేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ తో ఏ ప్రాంతీయ పార్టీకి సత్సంబంధాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ దాని దారిలో వెళ్తుందన్నారు. మా దారిలో మేము వెళ్తాం.. స్ట్రాటజీలో భాగంగానే యూపీ ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. మార్చి 3న వారణాసిలో ర్యాలీ నిర్వహిస్తానన్నారు. అయితే ఆదివారం సీఎం కేసీఆర్ కూడా ఎన్డీయేతర ముఖ్యమంత్రుల సమావేశంపై స్పందించారు. బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital