Thursday, January 9, 2025

ADB | మల్యాల గిరిజన ఆశ్రమ పాఠశాల టీచర్ సస్పెన్షన్

జన్నారం, జనవరి 8 (ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మల్యాల గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు అజ్మీర లక్ష్మణ్ నాయక్ ను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారనే అభియోగం మేరకు ఆయనను సస్పెండ్ చేసినట్లు నిర్మల్ డీటీడీఓ, మంచిర్యాల జిల్లా ఇన్చార్జి జాదవ్ అంబాజి బుధవారం తెలిపారు.

అతను విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, దీంతో గిరిజన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆ గ్రామ మాజీ సర్పంచి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, గ్రామ పెద్దలు ఉమ్మడి జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ పీఓకు ఇటీవల పిర్యాదు చేశారు. ఈ మేరకు అతన్ని సస్పెండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement