హైదరాబాద్, ఆంధ్రప్రభ: మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో తొటి దక్షిణాది రాష్ట్రాలకంటే తెలంగాణ రాష్ట్రం చాలా వెనకబడి ఉందని జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే -5 వెల్లడించింది. 6-23 నెలల వయసుగల చిన్నారుల్లో కేవలం 9శాతం మంది మాత్రమే కనీస పౌష్టికాహారాన్ని పొందగలుగుతున్నారు. సరేలో భాగంగా చిన్నారులకు తల్లి పాలు పట్టిస్తున్నారా..?, ఇతర ఆహారాన్ని అందిస్తున్నారా..?, ఆహారాన్ని అందిస్తే ఆ ఆహారంలో వారు ఏమి తింటున్నారు తదితర అంశాలను సరేలో ప్రధానంగా పరిశీలించారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అట్టడుగున ఉన్నాయి. తెలంగాణ లోని 6-59 వయసు ఉన్న చిన్నారులు 70శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. చిన్నారులతో పాటు మహిళలకు అందుతున్న పౌష్టికాహార విషయంలోనూ తెలంగాణ మిగతా దక్షిణాది కంటే వెనకబడి ఉంది.
తెలంగాణలోని 57.6శాతం మంది మహిళలను రక్తహీనత సమస్యల వేధిస్తోంది. ఈ అంశంలో ఏపీ తర్వాతిస్థానం తెలంగాణదే కావడం గమనార్హం. ఏపీలో 58.8శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. మహిళలు, చిన్నారులు పౌష్టికా హార లోపాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాన కారణం వారికి న్యూట్రీషియన్ ఫుడ్ ఈ ఆహార పదర్థాల్లో లభిస్తుందో అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రజల్లో ఎక్కువ శాతం మంది రక్తహీనతతో బాధపడుతుండడం గమనార్హం. ఎక్కువగా ఆర్డర్ చేసిన ఆహారపదర్థాలను తినడంతోపాటు పౌష్టిక విలువలు ఉన్న ఆహారానికి బదులు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటమే హైదరాబాదీల్లో పౌష్టికాహారలోపం తలెత్తేందుకు కారణమవుతున్నారు. మరోవైపు శారీరక శ్రమ తగ్గడం కూడా శరీరంలో పోషకాలు లోపించేందుకు కారణమవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..