Tuesday, November 19, 2024

TS | ఎల్‌ఆర్‌ఎస్‌ ఫ్రీ గా చేయండి.. లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పండి : కేటీఆర్

హైదరాబాద్ : ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్ ఆర్ ఎస్ పథకం కింద భూములను క్రమబద్ధీకరించేందుకు తక్షణమే మార్గదర్శకాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ లేఖ రాశారు.

ఈ సందర్భంగా ప్రస్తుత మంత్రులు గతంలో ఇచ్చిన వ్యాఖ్యలు, వాగ్దానాలను దృష్టిలో ఉంచుకుని ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేయాలని, లేని పక్షంలో హామీలను తుంగలో తొక్కి మాయమాటలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అని చెబుతున్న మీరు.. నేడు ఎందుకు దోపిడీ చేస్తున్నారో వివరించాలన్నారు.

ప్రతిపక్షంగా ప్రజల డిమాండ్‌ను తమ నిరసన కార్యక్రమం, వినతిపత్రాల రూపంలో ప్రభుత్వానికి అందించామన్న కేటీఆర్‌.. ప్రజల ఆకాంక్షల మేరకు ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేయాలని.. కాంగ్రెస్ నాయకులు చేసిన హామీలు మాట్లాడిన మాటలను తన లేఖలో ప్రస్తావించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement