Friday, November 22, 2024

న‌త్త‌న‌డ‌క‌గా మొక్క‌జొన్న కొనుగోళ్లు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మక్కజొన్న కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. అకాల వర్షాలతో మక్కజొన్న పంట లక్షల ఎకరాల విస్తీర్ణంలో నేలవాలింది. ప్రకృతి ప్రకోపాని కి ఎదురొడ్డి మక్క పంట నూర్పిడి చేసినా అకాల వర్షాలకు పలుచోట్ల మక్కలు తడిచి మొలకెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో పంట రాశిని కాపాడుకుని అమ్మేందుకు సిద్ధమైన రైతులకు మార్కెట్‌లో వ్యాపారుల దోపీడీ కారణంగా  కష్టాలు తప్పడం లేదు. ఈ విపత్కర సమయంలో వేగంగా స్పందించి మక్కలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన మార్క్‌ ఫెడ్‌ డిమాండ్‌కు తగిన విధంగా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అక్క డక్కా తెరిచినా వేగంగా కొనుగోళ్లు జరగడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మార్క్‌ఫెడ్‌కు అమ్ముదా మని పంటను కలాల్లో నిల్వ చేస్తే అకాల వర్షాలకు ఎక్కడ తడిసిపోతోందోనన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది. అదే సమయంలో మార్కెట్‌లో ప్రయివేటు వ్యాపారులకు అమ్ముదామంటే రూ.1500 రూ.1600 మధ్యనే ధర చెల్లిస్తూ ప్రయివేటు వ్యాపారులు నిలువుదోపీడీ చేస్తున్నారని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఆరుగాలం కష్టించి, పంటచేతి కొచ్చే సమయంలో అకాలవర్షాలు, గాలిదుమారా లను ఎదురొడ్డి మక్కలను పండిస్తే ప్రయివేటు వ్యాపారులు క్వింటాకు రూ.400 మేర ధర తక్కువగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి నెలన్నర క్రితం మక్క లకు మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఏర్పడింది. క్వింటాల్‌కు రూ.1962 మద్దతు ధర ఉన్నా రూ. 2500 దాకా మార్కెట్‌లో ధర ఉండేది. అయితే రబీ మక్కజొన్న పంట చేతికిరావడం, అకాల వర్షాల నేపథ్యంలో పంటను రైతులు నిల్వచేయలేని పరి స్థితులు ఉండడం తో ప్రయివేటు వ్యాపారులు రూ.1600కు మక్కల ధరను తగ్గిం చి రైతులను నిలువుదోపీడీకి గురి చేస్తున్నారు..

ఈ ఏడాది 6.50లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగు
ఈ ఏడాది యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 6.50లక్షల ఎకరాల్లో మక్కజొన్న పంట సాగైంది. ఉమ్మడి వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో అధి క విస్తీర్ణంలో మక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కజొన్నల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.

మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో 376 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు…
సీఎం ఆదేశాల మేరకు ఈ నెలలో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి దాదాపు 3852. 900 క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేశారు. వీటి విలువ దాదాపు రూ.8కోట్ల దాకా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 376 మక్కల కొనుగోలు కేంద్రాలను తెరిచింది. ఆదిలాబాద్‌లో 6, ఆసీఫాబాద్‌లో 4, మంచిర్యాలలో 5, నిర్మల్‌లో 40, నిజామాబాద్‌ 24, కామారెడ్డి 31, కరీంనగర్‌ 7, పెద్దపల్లి 5, జగిత్యాల 10, మెదక్‌ 17, సంగారెడ్డి 9, సిద్దిపేట 25, వరంగల్‌ 20, హన్మకొండ 25, మహబూబాబాద్‌ 30, ములుగు 2, జయశంకర్‌ 20, జనగామ 3, ఖమ్మం 35, భద్రాద్రి 10, రంగారెడ్డి 13, వికారాబాద్‌ 10, మహబూబ్‌నగర్‌ 4, నాగర్‌కర్నూలు 10, వనపర్తి 2, గద్వాల 8, సూర్యాపేట 1 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement