Thursday, November 21, 2024

Maharastra – మాట ఇచ్చాం .. అమ‌లు చేస్తున్నాం… అధికారంలోకి వస్తే ఇక్కడా అమలు చేస్తాం : రేవంత్ రెడ్డి

ఆరు గ్యారంటీల అమలులో వెన‌క్కి త‌గ్గేది లేదు
ఇచ్చిన మాట ప్ర‌కారం మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు
పేద‌ల‌కు విద్యుత్ స‌బ్సీడీ, అయిదు వంద‌ల‌కు గ్యాస్ ఇస్తున్నాం
తెలంగాణాలోని 22 ల‌క్ష‌ల మందికి రైతుల‌కు రుణ‌మాఫీ చేశాం
త‌మ ప‌థ‌కాల అమ‌లుపై మోదీ అబ‌ద్దాలు చెబుతున్నారు
గ‌త ప్ర‌భుత్వ విధానాల వ‌ల్లే తెలంగాణ‌లో నిరుద్యోగం
కేంద్ ప్ర‌భుత్వ విధానాలలోనే రైతుల ఆత్మ‌హ‌త్య‌లు
మ‌హ‌రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో రేవంత్ వెల్ల‌డి

ముంబ‌యి – దేశంలో ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు మహారాష్ట్రలో జరుగుతున్నాయని ఆరోపించారు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. దీని తర్వాత తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉండేదని చెప్పారు. గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతులను మోసం చేసిందని ఆరోపించారు. మ‌హ‌రాష్ట్ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల‌లో ప్రచారం చేసేందుకు ముంబ‌యి వెళ్లిన రేవంత్ అక్క‌డి మీడియాతో నేడు మాట్లాడుతూ,రైతుల సంక్షేమం కోసం ఎలాంటి పనులు చేపట్టలేదని విమర్శించారు. రైతులకు ఎంఎస్‌పీ ఇవ్వలేదని, రైతుల కోసం మోడీ నల్లచట్టాలను తెచ్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారని అన్నారు.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ గురించి, తమ ఆరు గ్యారెంటీల గురించి అబద్ధాలు బెబుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ మాపై దుష్ప్రాచారం చేయడం ఆపకపోవడం వల్ల తాను నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చానని చెప్పారు. తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ 2023లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ గ్యారెంటీలను ప్రణాళిక బద్దంగా ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాలను మహారాష్ట్ర ప్రజల ముందు పెట్టడం తన బాధ్యత అని అన్నారు.
తెలంగాణలో ఉన్న రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 25 రోజుల్లో 22 లక్షలకు పైగా రైతులుకు రూ.17,869 కోట్లు రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రతి రైతు డేటాను ఇస్తానని తెలిపారు. ఇటీవల ప్రధాని మోడీ ట్వీట్ చేశారని, రుణమాఫీపై పూర్తి వివరాలు ఇవ్వడంలో ప్రధాని ట్వీట్ డిలీట్ చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గ్యారెంటీ వల్ల సిద్దించిందన్నారు.

- Advertisement -

బిజెపితో బిఆర్ఎస్ దోస్తీ…

బీజేపీ దోస్త్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. బీజేపీ నేతలు, ఎక్‌నాథ్‌శిండే, అజిత్ పవార్ కాని ఎవరు తెలంగాణకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలపై పూర్తి వివరాలు ఇస్తామన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కోటి మందికి పైగా మహిళలు ఉపయోగిస్తున్నారు, ఇప్పటి వరకు ఆర్టీసీకి రూ.3541 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. రూ.500 సిలిండర్ దాదాపు 49 లక్షల కుటుంబాలు వినియోగించుకుంటున్నాయని తెలిపారు. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ దాదాపు 50 లక్షల కుటుంబాలు వినియోగిస్తున్నారని అన్నారు. రైతుల కోసం వడ్ల కొనుగోలులో ఎంఎస్‌పీ, రూ. 500 బోనస్ ఇస్తున్నామని అన్నారు.

మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోడీ గుజరాత్‌కు తరలించుకొని పోయారన్నారు. మరాట్వడ ప్రజలను మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించండి అని రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటువంటి సంక్షేమ ప‌థ‌కాల‌ను మ‌హారాష్ట్ర‌లోనూ అమ‌లు చేయాలంటే ఇక్క‌డి కాంగ్రెస్ కూట‌మికి గెలిపించాల‌ని రేవంత్ పిలుపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement