హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన చంద్రపూర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ నాయకులందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెసిఅర్ మాట్లాడుతూ, మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని భారాస అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. .. ”ఓటు వేస్తేనే మీకు ఎవరైనా సాయం చేయగలరు. మహారాష్ట్రలో భారాసకు ఏం పని అని ఫడణవీస్ అన్నారు. తెలంగాణ మోడల్ అమలు చేస్తే వెళ్లి పోతామని చెప్పాం. ఫడణవీస్ ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదు. తెలంగాణ మోడల్ దేశంలో ఎక్కడా లేదు” అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
డీఎన్‌డీ మహారాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌రావు అంగళ్వార్, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి రవీందర్ సింగ్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు బల్బీర్ సింగ్, బంజారా ఉమెన్ అధ్యక్షురాలు రేష్మ చౌహాన్, గడ్చిరోలి మాజీ జడ్పీ ఛైర్మన్ సమ్మయ్య తదితరులు భారాసలో చేరిన వారిలో ఉన్నారు..