హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీఆర్‌ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల పర్వం కొనసాగుతోంది. సౌత్ వెస్ట్ నాగ్‌పూర్ అసెంబ్లి నియోజకవర్గానికి చెందిన శివసేనలోని షిండే వర్గంలోని కీలక నేత ప్రవీణ్ షిండే అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ప్రస్తుతం సౌత్ ఈస్ట్ నాగ్‌పూర్ నుంచి బీజేపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో షిండే చేరికకు ప్రాధాన్యత చేకూరింది. వీరితో పాటు ధవలయన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు విక్రమ్ పిస్కే, పద్మశాలి యువసేన నేత గౌతమ్ సంగ, వ్యాపార వేత్త రఘురాములు కందికట్ల,తో పాటు పలువురు పెద్ద ఎత్తున గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను మహారాష్ట్ర సాంప్రదాయ పద్ధతిలో గొంగడితో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, దండే విఠల్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, మర్రి జనార్ధన్ రెడ్డి, మహారాష్ట్ర బీఆర్‌ఎస్ నేత శంకరన్న డోంగ్రేతో పాటు పలువురు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement