Tuesday, November 19, 2024

జయప్రకాష్ ను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు వెళ్లాలి: వెంకయ్య నాయుడు

యువత లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ వద్ద ఉన్న జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో.. కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా జయప్రకాష్ నారాయణ విగ్రహాన్ని.. మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి విగ్రహాన్ని మంత్రులు శ్రీనివాస్ గౌడ్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… అన్యాయాలకు.. అక్రమాలకు అరాచకానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పటిష్టతకు అలుపెరగకుండా పోరాటం చేసిన గొప్ప నాయకుడు జయప్రకాష్ నారాయణ అని కొనియాడారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా మాతృభాషను నేర్చుకోవాలని ఆ తర్వాత ఇతర భాషల పట్ల మక్కువ పెంచుకోవాలని సూచించారు. ఆంగ్ల భాషలో చదువుతేనే ఉన్నత స్థానాలకు ఎదుగుతామని యువతలో ఈ భావన నాటుక పోయిందని, దాన్ని విడనాడాలని సూచించారు. మాతృభాషలో చదివిన వారు ఎంతో గొప్ప వ్యక్తులుగా ఎదిగిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement