కార్మికులు వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ కోరారు. మేడే సందర్భంగా సోమవారం భవన నిర్మాణ కార్మికులకు 54 రకాల వైద్య పరీక్షల శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… కార్మికులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్సీ హెల్త్ కేర్ జిల్లా కోఆర్డినేటర్ సూగురు భాస్కర్, జిల్లా కార్మిక శాఖ అధికారి అబ్దుల్ షర్బుద్ధిన్, జిల్లా పౌర సమాచార శాఖ అధికారి సీతారాం నాయక్, క్యాంప్ కోఆర్డినేటర్ అజయ్ కుమార్, వైద్యులు డాక్టర్ స్వర్ణ విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు తిమ్మాజిపేట లక్ష్మీనారాయణ, ఎలక్ట్రిషన్ అధ్యక్షులు మాదాసి రఘు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement