Tuesday, December 3, 2024

MBNR | కరెంట్‌ షాక్‌తో మహిళ మృతి…

వనపర్తి ప్రతినిధి (ఆంధ్రప్రభ): ఇంటి ఆవరణలో ఉడుస్తుండగా ప్రమాద వశాత్తు విద్యుత్ షాక్ తగిలి మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర ఘటన మంగళవారం గోపాల్ పేట మండలం మున్ననూరు గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం మున్ననూర్ గ్రామానికి చెందిన ఎరుకలి యాదమ్మ (36) మంగళవారం తన ఇంటి ముందు వాకిలి ఉడుస్తుండగా.. విద్యుత్ వైర్లు తగిలి కింద పడిపోయింది.

గమనించిన స్థానికులు దవాఖానకు తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త సాయిలు గత మూడేళ్ల క్రితం అప్పుల బాధతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు ఎలక్ట్రీషియన్ కూలిగా పని చేస్తుండగా… చిన్న కుమారుడు గొర్ల కాపరుల వద్ద జీతం చేస్తున్నాడు. తల్లీ మృతితో కుమారులీద్దరూ అనాథలైయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement