Thursday, October 17, 2024

MBNR | హీమోఫిలియా బాధితులకు మెరుగైన వైద్యం.. పాలమూరులో అవగాహన

ఆంధ్రప్రభ స్మార్ట్, మహబూబ్​నగర్​: హీమోఫిలియా వ్యాధిగ్రస్తులకు అన్ని రకాల వైద్యం అందుబాటులో ఉందని ప్రభుత్వ జిల్లా వైద్యశాల జ‌నరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నగ్మా అన్నారు. వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహాలు సూచనలు పాటించాల‌ని తెలిపారు. శరీరంలో అంతర్గత రక్తస్రావం జరిగినప్పుడు వెంటనే వైద్యుల‌ను సంప్రదించాల‌న్నారు. హీమోఫిలియా వేల్ఫేర్ సొసైటీ మహబూబ్ నగర్ జిల్లా అధ్వర్యంలో హస్పిటల్ లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు..

ఈ కార్యక్రమంలో ఇంటాస్ ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ సామాజిక బాధ్యత కింద సమకూర్చిన సుమారు రూ.7 లక్షల విలువైన ఫ్యాక్టర్ 8 ఇంజిక్షన్ ల‌ను 30 మంది హీమోఫిలియా బాధితులకు డాక్టర్ నగ్మా పంపిణీ చేశారు. బాధితులకు ఇ‌నిబిటర్ స్క్రినింగ్ పరీక్షలు నిర్వహించారు. వ్యాధిబాధితులకు గాయాలు కాకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాల‌ని తెలిపారు..హస్పిటల్ అర్ఎంఓ డాక్టర్ గణేష్ ,పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ నాగేష్, డాక్టర్ శ్రీపాల్ హీమోఫిలియా లక్షణాలు, సకాలంలో చేపట్టాల్సిన వైద్యం గురించి వివరించారు..

బాధితులకు ప్రభుత్వం జారీ చేసిన అర్ పి డబ్ల్యూ 2016 ప్రకారంగా దివ్యాంగ సర్టిఫికెట్లు జారీ చేయాల‌ని జిల్లా హీమోఫిలియా సోసైటీ కార్యదర్శి సతీష్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో హీమోఫిలియా హైదరాబాద్ సోసైటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ రజాక్, జిల్లా హీమోఫిలియా సోసైటీ అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, సతీష్ కుమార్ ఇంటాస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ అసోషియేట్ కరుణాకర్,కౌన్సిలర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement