మహబూబ్నగర్ : పట్టణంలోని గోప్లాపూర్ లో తీవ్ర నీటి సమస్య ఉందని, వెంటనే కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ మేనేజర్ అశోక్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. నీటి కొరత ఉన్న దగ్గర మున్సిపల్ ట్యాంకర్ల ద్వార నీటిని సరఫరా చేయాలని బిజెపి పట్టణ అధ్యక్షుడు రవీందర్ కోరారు. తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని , వెంటనే తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి యువ మోర్చ మండల అధ్యక్షుడు శ్రీశైలం , రామ్ రెడ్డి , రాజు , ఫోటోగ్రాఫర్ సత్యం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement