Friday, November 22, 2024

ఉపాధి కూలీలకు దినసరి కూలీ వేతనం..

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో ఉపాధి హామీ పనులు వెంటనే ప్రారంభించి పెండింగ్‌లో ఉన్న కూలీల డబ్బులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రాములు అన్నారు. జిల్లా కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకట్రాములు ఈ సందర్భంగా మాట్లాడుతూ… వేసవి ని దృష్టిలో ఉంచుకొని ఉపాధి కూలీలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అధికారులు సిద్దం చేయాలని కోరారు. అదే విధంగా ఉపాధి కూలీలకు దినసరి కూలీ , వేతనం రూ.600 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం డబ్బులను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇతర పనులకు వాడుకుంటుందని , ఉపాధి హామీకి సంబంధించిన బడ్జెట్‌ను ఉపాధి హామీ కూలీలకే కేటాయించాలని కోరారు. ఉపాధి హామీ కూలీలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూలీలందరిని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కె. మోహన్‌ , నాయకులు రాజుకుమార్‌ , హనుమంతు , ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు , తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement