Tuesday, November 26, 2024

వినతి పత్రం..

మహబూబ్‌నగర్‌ : వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఉపాధి పనులను ప్రారంభించి పెండింగ్‌లో ఉన్న కూలీల డబ్బులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అన్నారు. ఈ సందర్భంగా గొల్లబండ తండా , గిరిజన కూలీలతో కలిసి ఏపిడికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.మోహన్‌ , రాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఉపాధి కూలీలకు వెంటనే పనిని గుర్తించి ఉపాధి కల్పించాలని కోరారు. వారు చేసిన పనికి సకాలంలో డబ్బులు చెల్లించాలని అధికారులను కోరారు. అదే విధంగా తీవ్రమైన ఎండతో పాటు , కరోనా ను దృష్టిలో ఉంచుకుని అధికారులు కూలీలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా గొల్లబండ తండా గిరిజన వాసులనుమహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల గత మూడు సంవత్సరాలుగా ఉపాధి కూలీలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , వారిపై ప్రత్యేక చొరవ తీసుకుని పని దినాలు కల్పించాలని కోరారు. లేనియెడల పెద్ద ఎత్తున పి డిఓ ఆఫీస్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి హనుమంతు , ఉపాధి కూలీలు మంజూల , సీతమ్మ , లక్ష్మిబాయి , నీలమ్మ , బాలునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement