దేవరకద్ర : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. సిసికుంట మండల పరిధిలోని అప్పంపల్లి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శ్రద్ద తీసుకుని గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి హర్షవర్దన్ రెడ్డి, జడ్పిటిసిలు , ఎంపిటిసిలు , పార్టీ అధ్యక్షులు సొసైటీ అధికారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement