Saturday, November 23, 2024

ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు..

దేవరకద్ర : మండల కేంద్రంలో స్థానిక హరిజనవాడ వద్ద ఉన్న రైల్వే అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి కింద రహదారి ఇలాఉంటే వెళ్లేది ఎలాగ అని వాహనదారులు , పాదచారులు అంటున్నారు. అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి నిర్మాణం జరిగినప్పటి నుంచి కింద భాగంలో నీరు యథావిధిగా ఉంటుందని వాహనదారులు అంటున్నారు. బ్రిడ్జి కింద ఉన్న నీరు పోవడానికి ఎలాంటి మార్గం లేకపోవడంతో అలాగే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తున్నది. దానివల్ల ప్రతిరోజు వ్యవసాయ బావి వద్దకు వెళ్లే రైతులుగానే వాహనదారులు గానీ ఈ దారిలో వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు , నాయకులు శ్రద్ద తీసుకుని అండర్‌ గ్రౌంఢ్‌ బ్రిడ్జి కింద ఉన్న నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎప్పటి లాగే రహదారులు వాహనాల రాకపోకలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అధికారులు స్పందించాలి : అమృత వర్మ , ఎంపిటిసి
మండల కేంద్రంలో స్థానిక హరిజన వాడ సమీపంలో అండర్‌ గ్రౌంఢ్‌ బ్రిడ్జి కింద ఉన్న నీటిని తరలించేందుకు అధికారులు , ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించాలని ఎంపిటిసి అమృత వర్మకోరారు. దాని వలన వాహనదారులు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు , ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకొని వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement