Friday, November 22, 2024

MBNR : అభివృద్ధిని చెప్పుకోలేక… కాంగ్రెస్​ నేతల వ్యక్తిగత ఆరోపణలు.. ఎంపీ అభ్యర్థి డీకే అరుణ

మక్తల్, మే2(ప్రభన్యూస్) : ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఆడబిడ్డనైన తనపై నోటికి వచ్చినట్లు తూలనాడడం భావ్యం కాదని బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి డీకే అరుణ అన్నారు. లోక్ స‌భ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మక్తల్ పట్టణంలో నిర్వహించిన రోడ్ షో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

- Advertisement -

కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి గురించి చెప్పుకునే అవకాశం లేక తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మాట్లాడే ముందు కాంగ్రెస్ నాయకులకు అమ్మ ఆలీ చెల్లి అనేవారు లేరా అని తమకు తాము ఆలోచించుకోవాలని బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఏ పార్టీ అభ్యర్థి అయినా రేపు గెలిపిస్తే ఏ అభివృద్ధి చేస్తారో చెప్పుకుంటారని కానీ కాంగ్రెస్ నాయకులకు ఏం చేయబోతున్నాము ఏం చేశామో చెప్పుకునే అవకాశం లేక తనపై నోటికొచ్చినట్లు దూషణలకు దిగుతున్నారని ఇంత దిగజారుడు రాజకీయం ఎన్నడూ చూడలేదని అన్నారు. పాలమూరు జిల్లాలో మంత్రిగా తాను చేసిన అభివృద్ధి తప్ప పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు.

మక్తల్ నుండి జిల్లా కేంద్రం నారాయణపేట మరో జిల్లా కేంద్రం గద్వాల కు వెళ్లే దుస్థితిలో ఉన్నాయని వాటి గురించి పట్టించుకునే ధ్యాస వారికి లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ ల పేరుతో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు ఉందా అని ఆమె ప్రశ్నించారు. అదే సమయంలో ఐదేళ్లు ఎంపిగా పని చేసిన బిఆర్ఎస్ అభ్యర్థి చేసింది ఏమీ లేదని ఆ పార్టీకి కూడా ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. దేశ అభివృద్ధి బిజెపి తోనే సాధ్యమని పాలమూరు అభివృద్ధి కోసం తనను ఎంపిగా గెలిపించాల్సిందిగా డీకే అరుణమ్మ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య మున్సిపల్ చైర్ పర్సన్ బాల్చేడ్ పావని మల్లికార్జున్, వైస్ చైర్పర్సన్ బి. అఖిల రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు చీరాల సత్యనారాయణ, కర్ని లక్ష్మీ స్వామి, ఈసారి కౌసల్య నాగప్ప, కోల్పూర్ కొండయ్య, నాయకులు కర్ని స్వామి, దేవరింటి నరసింహారెడ్డి ,బి. రాజశేఖర్ రెడ్డి, చిట్యాల లక్ష్మణ్, జి. బలరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement